PRABANJANAM
Date of Publish : 26 November 2026, 9:17 pm Posted by : Prabanjanam News

రాజ్యాంగ విలువలు ఆచరణలోకి రావాలి

  • ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా మాజీ అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ

మహబూబ్ నగర్ బ్యూరో, (ప్రభంజనం):

రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు రాజ్యాంగ విలువలు పూర్తిస్థాయిలో ఆచరణలోకి రావాలని ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా మాజీ అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ అన్నారు. 77వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల వివక్ష లేని సమసమాజ నిర్మాణమే అంబేద్కర్ ఆశయమన్నారు. యువత సోషల్ మీడియాకే పరిమితం కాకుండా రాజ్యాంగాన్ని చదివి తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పుట్టపాగ అజయ్ మాదిగ సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు గంధం గట్టయ్య మాదిగ, మిద్దె నాగేష్ మాదిగ, శివ నాయక్, ఆదం రాజ్, గోపాల్ మాదిగ, సుధీర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.