Madhapur: నిర్మాణం కూలి ఇద్దరి మృతి.. మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెన్షన్
శేరిలింగంపల్లి (ప్రభంజనం): గచ్చిబౌలి పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనకు సంబంధించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయడంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సీఎంసీ కమిషనర్ జి. శ్రీజన ఆమోదంతో ఆగస్టు 22న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సర్కిల్-50, మాదాపూర్‌కు చెందిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ పర్మిషన్ అధికారి (టీపీబీఓ) యు....