PRABANJANAM
Date of Publish : 22 September 2026, 1:49 pm Posted by : Prabanjanam News

ఇందిరమ్మ ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతివ్వాలి..

  • ప్రజావాణిలో సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిచరణ్ విజ్ఞప్తి

సిరికొండ, సెప్టెంబర్ 22 (ప్రభంజనం):

సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిచరణ్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఇందిరమ్మ ప్లాట్లు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఎస్సీ కాలనీ ప్రాంతంలోని లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి భూములు చూపించారని, ప్రస్తుతం ఆయా ప్లాట్లలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతించాలని కోరారు. అలాగే కొండూరు రోడ్డువైపు ఇతర నిరుపేదలకు పట్టాలు ఇచ్చినా ఇప్పటివరకు స్థలాలు చూపించలేదని, ప్లాట్లను గుర్తించి లబ్ధిదారులకు అప్పగించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని వినతిపత్రంలో కోరారు.