డబుల్ మర్డర్ కేసులో భార్యాభర్తలకు జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
వివరాలు వెల్లడించిన నిజామాబాద్ సీపీ సాయి చైతన్య నిజామాబాద్, (ప్రభంజనం): నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన డబల్ మర్డర్ కేసులో నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన లత, ఆమె రెండేళ్ల కుమారుడు హర్షవర్ధన్‌ను హత్య చేసిన కేసులో నిందితులు దాసరి రాజశేఖర్, అతని భార్య నాగలక్ష్మీకి నిజామాబాద్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2022 ఆగస్టు 2న ఆస్తి వివాదం నేపథ్యంలో తల్లీకొడుకులను నైలాన్ తాడుతో గొంతు...