‘గుప్త నిధుల’ పేరుతో రూ.కోటి మోసం
ముఠాలో నలుగురు అరెస్ట్.. నకిలీ బంగారు నాణేలు, వాహనాలు స్వాధీనం. క్రైమ్ బ్యూరో : ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. రాజేంద్రనగర్ పోలీసుల సహకారంతో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కార్లు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు, 25 నకిలీ బంగారు పూత నాణేలు, ఆరు కిలోల బొగ్గు, నాలుగు కిలోల మట్టి, పూజా సామగ్రిని...