గడువు ముగియకముందే కరెంట్ కట్.. లైన్‌మన్‌పై చర్యలకు ఆదేశం
లైన్‌మన్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం మేడ్చల్ ప్రతినిధి (ప్రభంజనం): విద్యుత్ బిల్లు చెల్లించేందుకు గడువు ముగియకముందే వినియోగదారుడి విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటనపై వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత లైన్‌మన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీజీఎస్‌పీడీసీఎల్ అధికారులను ఆదేశించింది. ఆదేశాలు అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. జగద్గిరిగుట్ట మక్దూమ్‌నగర్‌కు చెందిన వాకిటి మధుబాబు (సర్వీస్ నం. 0905 08395) తన విద్యుత్ కనెక్షన్‌ను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా నిలిపివేశారంటూ ఫోరాన్ని...