PRABANJANAM
Date of Publish : 04 August 2026, 6:09 pm Posted by : Prabanjanam News

సీసీఎల్ఏ ముందు భూ భారతి ఉద్యోగుల ధర్నా

ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్ : అబిడ్స్ లోని సీసీఎల్ఏ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళనకు దిగారు భూ భారతి ఉద్యోగులు.భూ భారతిలో ఫీల్డ్ టెక్నికల్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 636మంది ఉద్యోగులలో.. 300మందిని తొలగించడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. భూ సమష్యాలపై నిరంతరం కృషి చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గత 15నెలలుగా తమకు జీతాలు రావడం లేదని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమష్యాలు పరిష్కారం కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు భూ భారతి ఫీల్డ్ టెక్నికల్ ఉద్యోగులు.