గచ్చిబౌలిలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం..
గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. రాఘవ ప్రాజెక్ట్ లేబర్ క్యాంప్ నుంచి ప్రమీలా ముర్ము (4), సంగీత (3) అనే ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. పిల్లలను దుకాణానికి తీసుకెళ్తానని చెప్పి వారి తల్లిదండ్రుల సహోద్యోగి చాకు సోరెన్ వెంట తీసుకెళ్లాడు. అయితే ఎంతసేపటికీ చిన్నారులు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అర్ధరాత్రి దాటినా చిన్నారులతో పాటు...