నేటి నుంచే సరికొత్త ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీ
హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలకు సరికొత్త స్వాతంత్ర్య దినోత్సవ కానుకను అందించింది. పాత, చిరిగిపోయే పేపర్ కార్డుల స్థానంలో దేశంలోనే మొదటిసారిగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ల్యామినేటెడ్ పీవీసీ (PVC) స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని నేడు అధికారికంగా ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిల...