బెలియా తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
లబ్ధిదారులకు అందజేసిన సర్పంచ్ రావుజి నాయక్ ధర్పల్లి : (ప్రభంజనం) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి మండలం బెలియా తండా గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రావుజి నాయక్ లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ రేషన్ సరుకులు మరింత సులభంగా అందుబాటులోకి...