PRABANJANAM
Date of Publish : 20 September 2026, 10:24 am Posted by : Prabanjanam News

హైదర్ నగర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

  • అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేరాలి
  • కాంగ్రెస్ నాయకులు

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

హైదర్ నగర్ డివిజన్‌లో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతుల రాజేందర్ పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతుల రాజేందర్ పటేల్, సత్యనారాయణ, షరీఫ్ భాయ్, చాట్ల రవి, ఎం.డి. యాసిన్, హబీబ్, ఫసి, చంద్రయ్య, బ్రహ్మయ్య, నరసింహ, సూర్యనారాయణ రెడ్డి, ముఖేష్, కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.