విలేకరుల ముసుగులో వసూళ్ల కు పాల్పడితే ఊరుకోం..
తప్పుడు కథనాలకు చెక్ పెట్టండి పోలీసులకు జవహర్ నగర్ విలేకరుల ఫిర్యాదు జవహర్నగర్: ( ప్రభంజనం ) మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జాల పేరుతో కొందరు వాస్తవాలకు విరుద్ధమైన కథనాలు ప్రచురిస్తున్నారని స్థానిక విలేకరులు మండిపడ్డారు. తోటి విలేకరుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గురువారం జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ సైదులును కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. స్థానిక విలేకరులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పరిణామాలు, విలేకరుల పేరుతో వసూళ్లకు...