విద్యార్థినులకు డబుల్‌ బెనిఫిట్‌.. యూనిఫామ్‌లు, హెచ్‌పీవీ టీకాలు

బాన్సువాడ: విద్యార్థినుల విద్య, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ బాన్సువాడ ప్రభుత్వ జడ్‌పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు రాణి ఆధ్వర్యంలో విద్యార్థినులకు పాఠశాల యూనిఫామ్‌లను పంపిణీ చేయడంతో పాటు హెచ్‌పీవీ క్యాన్సర్‌ నివారణ టీకాలను అందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాఠశాలకు హాజరయ్యేలా యూనిఫామ్‌లు ఉపయోగపడతాయని, అదే సమయంలో ఆరోగ్య పరిరక్షణకు హెచ్‌పీవీ టీకాలు ఎంతో ముఖ్యమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. విద్యార్థినులు ప్రభుత్వం, వైద్య సిబ్బంది అందిస్తున్న ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాన్సువాడ...