- ప్రధానం చేసిన కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి అడ్వా శ్రీపాద్ యెస్సో నాయక్
ఉప్పల్,అక్టోబర్ 7,(ప్రభంజనం):
సమాజ సేవా రంగంలో అంకితభావం నిస్వార్థ సేవకు గాను తెలంగాణకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, హెడ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ సెక్రటరీ డా. దేవరకొండ సత్యనారాయణ (సతీష్ ) కు ప్రతిష్టాత్మక భారత్ నిర్మాణ్ యోగదాన్ అవార్డు 2026 (ఆల్ ఇండియా) లభించింది. ఈ అవార్డు ప్రధానోత్సవం మాక్వినెజ్ ప్యాలెస్ ఆడిటోరియం, పనాజి గోవాలో ఘనంగా జరిగింది. ఈ అవార్డును ముఖ్య అతిథి అడ్వా శ్రీపాద్ యెస్సో నాయక్, కేంద్ర విద్యుత్, కొత్త అండ్ పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి, భారత ప్రభుత్వం చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సియోలిమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా వైస్ చైర్మన్ డెలిలా మైఖేల్ లోబో బీజేపీ గోవా రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆప్లా వైభవ్ ఫౌండేషన్, మహారాష్ట్ర (వ్యవస్థాపక అధ్యక్షులు వైభవ్ విర్కర్), గోవాకు చెందిన కమ్యూనిటీ లీడర్ & సోషల్ యాక్టివిస్ట్ ఐశ్వర్య సాల్గావ్కర్, ఆర్డీ ఈవెంట్స్ వ్యవస్థాపకురాలు దీపా కేర్కర్ సంయుక్తంగా నిర్వహించారు. సామాజిక కార్యకర్తగా హెడ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ సెక్రెటరీగా చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.