మౌలాలిలో డ్రగ్స్ తయారీ గుట్టు రట్టు..నిందితుడి అరెస్ట్, డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్ :  మౌలాలి పారిశ్రామిక ప్రాంతంలోని ఎస్‌ఎం ల్యాబ్స్ యూనిట్-2లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్న నెట్‌వర్క్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఛేదించారు. పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఎస్‌ఎం ల్యాబ్స్ యూనిట్-2 యజమాని మాణిక్య రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. ల్యాబ్‌లో తయారు చేసిన సుమారు 60 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.17 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా...