ED Raids On Neetu Bhai: గంజాయి డాన్ ‘నీతూ బాయి’ ఆస్తులపై ఈడీ సోదాలు..డ్రగ్స్ రాకెట్ నిర్వహణపై ఆరా
సిటీ క్రైమ్ (ప్రభంజనం): డ్రగ్స్ కేసులకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. గంజాయి రాకెట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీతూ బాయికి సంబంధించిన ఇళ్లు ఇతర ప్రదేశాల్లో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (Eagle Team) నమోదు చేసిన డ్రగ్స్ కేసుల ఆధారంగా ఈ మనీలాండరింగ్ దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. నషా ముక్త్ భారత్ ప్రచారంలో...