- శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు
యాదగుగుట్ట,(ప్రభంజనం):
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను వివిధ రకాల పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్య ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు.
అనంతరం స్వామివారికి సుగంధ పరిమళాలు వెదజల్లే వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం జరిగిన ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, దేవస్థాన అధికారులు పాల్గొన్నారు.