స్వామివారికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 22 (ప్రభంజనం):
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏకాదశి పూజలను మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను వివిధ రకాల పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్య ఆభరణాలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అనంతరం సుగంధ పరిమళ పుష్పాలతో స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రానుసారం జరిగిన కార్యక్రమంలో ఆలయ ఈఓ భవాని శంకర్,అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.