రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్ అమలు.. నిందితుడిపై ఏడాది పాటు నిర్బంధానికి చర్యలు
కామారెడ్డి ప్రతినిధి (ప్రభంజనం): కామారెడ్డి జిల్లాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లు, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీషీటర్ కాట్యాడ బాపురావు అలియాస్ బాపురావు పై తెలంగాణ ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం–1986 (పీడీ యాక్ట్ ) కింద జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సంగ్వాన్ డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు గతంలో కూడా పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉండగా, ఇటీవల దేవన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన దోపిడీ కేసు, గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు...