PRABANJANAM
Date of Publish : 03 October 2026, 7:13 am Posted by : Prabanjanam News

టాస్కా చిల్కానగర్ డివిజన్ నూతన శాఖ ఆవిర్భావం

  • సీనియర్ సిటిజన్ల అనుభవం సమాజ ప్రగతికి ఉపయోగపడాలి: సీపీ బి.సుమతి

ఉప్పల్: (ప్రభంజనం )

తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టాస్కా) చిల్కానగర్ డివిజన్ నూతన శాఖ ఆవిర్భావ సమావేశం శుక్రవారం నోవా బాంకెట్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి సమాజ అభివృద్ధి వెనుక సీనియర్ సిటిజన్ల కృషి, త్యాగం, అనుభవం ఉన్నాయని, వారి అనుభవ సంపదను యువతకు మార్గదర్శకంగా ఉపయోగించుకోవాలని సూచించారు. తరాల మధ్య పరస్పర అవగాహన, గౌరవం అవసరమని, సీనియర్ సిటిజన్ల గౌరవం, భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. ఉప్పల్ తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. చిల్కానగర్‌లో సీనియర్ సిటిజన్ల కోసం సామాజిక పార్కు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు స్థల కేటాయింపు ప్రతిపాదనలు సిద్ధం చేస్తానని హామీ ఇచ్చారు. టాస్కా రాష్ట్ర అధ్యక్షుడు పి. నరసింహారావు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీనియర్ సిటిజన్ సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. టాస్కా చిల్కానగర్ డివిజన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొమ్మగాని దాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ప్రత్యేక భవనం, పార్కు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఏసీపీ వెంకట్ రెడ్డి, టాస్కా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి, జిల్లా ఇన్‌చార్జి వెంకటయ్య గౌడ్, దేవసాని బాలచందర్, నెర్థం భాస్కర్ గౌడ్, అంబటి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదే నూతన కమిటీ..

టాస్కా అధ్యక్షుడిగా బొమ్మగాని దాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బోడ విద్యాసాగర్, కోశాధికారిగా షామీర్‌పేట్ చంద్రయ్య, అడ్వైజర్లుగా శంభు ప్రసాద్, పెండెం నాగార్జున, రామ్‌చర్ల బలరాం, దండు అంజయ్య ఎన్నికయ్యారు. మరో పది మందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.