PRABANJANAM
Date of Publish : 24 October 2026, 8:32 am Posted by : Prabanjanam News

ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి.. మంత్రి పొన్నం

  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ ఎన్‌రోల్మెంట్ కార్యక్రమం..
  • పాల్గొన్న మంత్రులు పొన్నం, అజారుద్దీన్, ఎమ్మెల్యే శ్రీ గణేష్

కంటోన్మెంట్,(ప్రభంజనం):

మారేడ్ పల్లి టీచర్స్ కాలనీ పార్క్ సమీపంలో గల జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ ఎన్‌రోల్మెంట్ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దీపక్ జాన్ తో కలిసి కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్హులైన గ్రాడ్యుయేట్లకు ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించి, వారి పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేయించారు. ప్రతి అర్హుడైన గ్రాడ్యుయేట్ తన ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్ ఎన్‌రోల్మెంట్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమైనది, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ తమ పేరును ఓటర్ జాబితాలో నమోదు చేసుకొని ప్రజాస్వామ్య బలోపేతానికి భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రులు పిలుపునిచ్చారు.