హరీశ్‌రావుపై తప్పుడు ప్రచారం..ఓయూ పీఎస్‌లో బీఆర్ఎస్‌వీ ఫిర్యాదు
ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకోం కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డిపై బీఆర్ఎస్‌వీ ఆగ్రహం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఉస్మానియా యూనివర్సిటీ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్‌రావుపై కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (BRSV) మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని పేరు సంపాదించుకున్న హరీశ్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్...