PRABANJANAM
Date of Publish : 10 October 2026, 11:33 am Posted by : Prabanjanam News

రాంపల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

  • వెనుక నుంచి ఢీకొన్న గ్యాస్ లారీ.. యువకుడు దుర్మరణం

కీసర: ( ప్రభంజనం )

కీసర రాంపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నాగారం నివాసి అఖిల్ (20) ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాంపల్లి చౌరస్తా వద్ద అఖిల్‌ను వెనుక నుంచి వచ్చిన గ్యాస్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న వయసులోనే యువకుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, ఇతర వివరాలను సేకరిస్తున్నారు.