ఖాజాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
శేరిలింగంపల్లి (ప్రభంజనం): హైదరాబాద్‌లోని ఖాజాగూడ ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 4:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఖాజాగూడ నుంచి అంజయ్యనగర్ వైపు ముగ్గురు వ్యక్తులు ( డబ్ల్యూ 26 బీఎం 2608 ) మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్నారు. ఈఎస్ ఐ రెండో గేట్ సమీపంలో కేర్ హాస్పిటల్ మెయిన్ రోడ్ వైపు కుడివైపు మలుపు తీసుకుంటుండగా, వేగంగా వాహనం నడపడం, మలుపులో నియంత్రణ కోల్పోవడంతో బైక్ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు....