యంనంపేట ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..
ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం యువతికి తీవ్ర గాయాలు ఘట్కేసర్, (ప్రభంజనం): మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంనంపేట ఫ్లైఓవర్‌పై శనివారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తిప్పారెడ్డిపల్లికి చెందిన బద్దుల కిషోర్ (19) అనే విద్యార్థి ప్రస్తుతం బీ.ఎన్.రెడ్డి నగర్‌లో నివాసముంటూ ఇబ్రహీంపట్నంలోని సెయింట్ మార్టిన్స్/సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్...