జానీ మాస్టర్‌ కు డ్యాన్సర్స్ యూనియన్‌కు ఫెడరేషన్ షాక్

యూనియన్ లో నిషేధం కొనసాగింపు.. సినిమా డెస్క్ (ప్రభంజనం): ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య (ఫిల్మ్ ఫెడరేషన్) మరోసారి షాక్ ఇచ్చింది. ఆయనపై గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగించాలని ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ నిర్ణయించింది. బుధవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినందుకే జానీ మాస్టర్‌పై విధించిన చర్యలను కొనసాగిస్తున్నట్లు సమాఖ్య స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆయన గతంలో ఫెడరేషన్‌కు అందజేసిన రూ.3 లక్షల మొత్తాన్ని కూడా...