ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: యశస్వి
సిటీ బ్యూరో (ప్రభంజనం): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్క యశస్వి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చేపట్టిన దీక్షకు మద్దతుగా పాల్గొన్న యశస్వి మాట్లాడుతూ..ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరాలు పూర్తయినా ఫీజు బకాయిల కారణంగా కొన్ని కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో ఉన్నత విద్య,...