PRABANJANAM
Date of Publish : 23 October 2026, 8:49 am Posted by : Prabanjanam News

మేడిపల్లిలో ఫార్చ్యూనర్‌ కారు బీభత్సం..

  • పీర్జాదిగూడ సమీపంలో ఐ10 కారును ఢీకొట్టిన ఫార్చ్యూనర్‌..
  • విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని నిలిచిన ఎస్‌యూవీ
  • ఐ10 లో ఉన్న దంపతులకు గాయాలు

మేడిపల్లి: ( ప్రభంజనం )

హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై మేడిపల్లి పరిధిలోని పీర్జాదిగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన టయోటా ఫార్చ్యూనర్‌ కారు ముందు వెళుతున్న హ్యుందాయ్‌ ఐ10 కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐ10 కారు పల్టీలు కొడుతూ బోల్తా పడగా, అందులో ప్రయాణిస్తున్న దంపతులు గాయపడ్డారు. ఐ10 కారును ఢీకొట్టిన అనంతరం ఫార్చ్యూనర్‌ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్‌ స్తంభం ఫార్చ్యూనర్‌ కారుపై పడింది.
ప్రమాదంలో గాయపడిన దంపతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

డ్రైవర్‌పై పోలీసుల విచారణ

ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫార్చ్యూనర్‌ కారు డ్రైవర్‌ మద్యం మత్తులో వాహనం నడిపాడా, వాహనానికి నకిలీ నంబర్‌ ప్లేట్‌ అమర్చారా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండానే కారు నడిపాడా అనే అంశాలను పరిశీలిస్తున్నారు.