మేడిపల్లిలో ఫార్చ్యూనర్ కారు బీభత్సం..
పీర్జాదిగూడ సమీపంలో ఐ10 కారును ఢీకొట్టిన ఫార్చ్యూనర్.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నిలిచిన ఎస్‌యూవీ ఐ10 లో ఉన్న దంపతులకు గాయాలు మేడిపల్లి: ( ప్రభంజనం ) హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై మేడిపల్లి పరిధిలోని పీర్జాదిగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన టయోటా ఫార్చ్యూనర్ కారు ముందు వెళుతున్న హ్యుందాయ్ ఐ10 కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐ10 కారు పల్టీలు కొడుతూ బోల్తా పడగా, అందులో ప్రయాణిస్తున్న దంపతులు గాయపడ్డారు. ఐ10 కారును ఢీకొట్టిన అనంతరం ఫార్చ్యూనర్ కారు అదుపుతప్పి...