భూములపై బ్యాంకు రుణాల పేరుతో మోసం.. అంతరాష్ట్ర కేటుగాడు అరెస్ట్

క్రైమ్ బ్యూరో(ప్రభంజనం ):సొంత ఆస్తులు, స్థలాలపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, వారి ఆస్తుల సేల్ డీడ్ పత్రాలను దుర్వినియోగం చేస్తూ మూడో వ్యక్తుల పేర్లకు బదలాయించి కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర కేటుగాడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2016 నుంచి 20కి పైగా క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితుడిని రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన నునావత్ యుగంధర్ (34)గా గుర్తించారు. ఆస్తులపై రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఇప్పటివరకు...