PRABANJANAM
Date of Publish : 11 August 2026, 7:05 am Posted by : Prabanjanam News

పోలీసుల పేరుతో కేసు మేనేజ్‌ చేస్తామని మోసం..ఇద్దరు అరెస్టు

  • రూ.1.40 లక్షలు వసూలు..కేపి.హెచ్.బి లో ఇద్దరి అరెస్టు

కేపీహెచ్‌బీ: పోలీసు అధికారులతో పరిచయాలు ఉన్నాయని, ఎన్‌డీపీఎస్‌ కేసులో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొస్తామని నమ్మించి కుటుంబ సభ్యుల నుంచి రూ.1.40 లక్షలు వసూలు చేసిన ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఉప్పలపాటి కాశీ విశ్వనాథ రాజు(39), సయ్యపరాజు సురేష్‌కుమార్‌(43)గా గుర్తించారు. కేసు నుంచి బయటకు తీసుకొస్తామని, జైలుకు వెళ్లకుండా చూస్తామని భయపెట్టి రూ.2 లక్షలు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారురాలు రూ.1.10 లక్షలు నగదు, ఫోన్‌పే ద్వారా రూ.30 వేలు చెల్లించింది. నిందితుల నుంచి రూ.1.10 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోగా.. ఫోన్‌పే ద్వారా బదిలీ చేసిన రూ.30 వేలను బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.