PRABANJANAM
Date of Publish : 16 August 2026, 9:37 am Posted by : Prabanjanam News

గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింహా రాజుకు ప్రతిష్టాత్మక సేవా మెడల్

  • ప్రధానం చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

పోలీస్ శాఖలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నర్సింహా రాజు ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర సేవా మెడల్ అందుకున్నారు. శనివారం జరిగిన కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి చేతుల మీదుగా నర్సింహ రాజు ఈ ప్రతిష్టాత్మక సేవా మెడల్‌ను స్వీకరించారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, పోలీస్ వృత్తిని సామాజిక బాధ్యతగా నిర్వహిస్తూ.. ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో చూపిన అంకితభావం, కర్తవ్యనిష్ఠ, సమర్థవంతమైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించడం విశేషం. సేవా మెడల్ అందుకున్న సందర్భంగా ఇన్‌స్పెక్టర్ నర్సింహారావును పోలీస్ అధికారులు, సిబ్బంది, సహచరులు అభినందించారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మరింత అంకితభావంతో పనిచేస్తానని నర్సింహా రాజు తెలిపారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారికి రాష్ట్ర స్థాయి సేవా పురస్కారం లభించడం పట్ల స్థానికంగా కూడా హర్షం వ్యక్తమవుతోంది.