వేయి స్తంభాల దేవాలయంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాల ప్రారంభం..

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు హనుమకొండ:(ప్రభంజనం ) చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో ప్రతిష్ఠించిన మహా గణపతి నవరాత్రి ఉత్సవాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా అధికారికంగా ప్రారంభించారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన సతీమణి నీలిమ రాజేందర్ రెడ్డితో కలిసి వేయి స్తంభాల దేవాలయానికి చేరుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్...