టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
నివాళులర్పించిన గ్రేటర్ హైదరాబాద్ ఇంఛార్జీ వాసిలి శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) గాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ ఎస్ ) ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ ఎస్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ పాల్గొన్నారు. మదీనగూడ డివిజన్‌లోని టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మక్త మహబూబ్‌పేట్ డివిజన్...