PRABANJANAM
Date of Publish : 26 September 2026, 12:00 pm Posted by : Prabanjanam News

గుల్మోహర్ పార్క్ కాలనీలో ఘనంగా గణేష్ లడ్డూ వేలం..

  • రూ.2.55 లక్షలకు దక్కించుకున్న పులిపాటి కుటుంబం

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గుల్మోహర్ పార్క్ కాలనీ గణేష్ మండపం వద్ద నిర్వహించిన స్వామివారి ప్రసాదం లడ్డూ వేలం పాట ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ వేలంలో కాలనీకి చెందిన పులిపాటి కుటుంబం రూ.2,55,000 (రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు) కు లడ్డూను దక్కించుకుంది. పులిపాటి శ్రీనివాస్, శారద, కౌశల్, కశ్యప్ ల కుటుంబం తీవ్ర పోటీ మధ్య ఈ వేలంలో పాల్గొని లడ్డూను స్వంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పులిపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గణనాథుని ప్రసాద లడ్డూను దక్కించుకోవడం తమ కుటుంబానికి ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, వినాయకుడి కృపతో కాలనీవాసులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. వేలం ద్వారా వచ్చిన ఈ నిధులను మండప నిర్వహణకు, స్థానిక ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పులిపాటి కుటుంబాన్ని అభినందించారు.