గుల్మోహర్ పార్క్ కాలనీలో ఘనంగా గణేష్ లడ్డూ వేలం..

రూ.2.55 లక్షలకు దక్కించుకున్న పులిపాటి కుటుంబం శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గుల్మోహర్ పార్క్ కాలనీ గణేష్ మండపం వద్ద నిర్వహించిన స్వామివారి ప్రసాదం లడ్డూ వేలం పాట ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ వేలంలో కాలనీకి చెందిన పులిపాటి కుటుంబం రూ.2,55,000 (రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు) కు లడ్డూను దక్కించుకుంది. పులిపాటి శ్రీనివాస్, శారద, కౌశల్, కశ్యప్ ల కుటుంబం తీవ్ర పోటీ మధ్య ఈ వేలంలో పాల్గొని లడ్డూను స్వంతం...