హెచ్‌యూసీలో గంజాయి సరఫరా కేసు.. పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్
హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌యూసీ) క్యాంపస్ కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కొంతకాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు, 'ఈగల్ టీమ్' సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం హెచ్‌యూసీ క్యాంపస్‌లోనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లా లైకాబలి అప్పర్ కాలనీకి చెందిన భిస్వజిత్ కలితా అలియాస్ బిస్వా (28) ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో...