మియాపూర్ జీఎస్ఎం మాల్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలుడు..

ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు.. ఐస్క్రీమ్ బండి నిర్వాహకుడి పరిస్థితి విషమం బెలూన్లలో హీలియం గ్యాస్ నింపుతుండగా ప్రమాదం శేరిలింగంపల్లి,( ప్రభంజనం):మియాపూర్‌లోని జీఎస్ఎం మాల్ సమీపంలో బెలూన్లలో గ్యాస్ నింపేందుకు ఉపయోగించే చిన్న సిలిండర్ పేలడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో ఐస్క్రీమ్ బండి నిర్వహిస్తున్న ఓ యువకుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఓ కాలేజీ విద్యార్థిని, ఓ ఐటీ...