పేద విద్యార్థులకు ‘సాప్స్’ చేయూత.. మదర్ మీరా హైస్కూల్‌లో వేడుకలు
మల్లాపూర్,(ప్రభంజనం): మదర్ మీరా హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ తిమోతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు.విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించడంతోపాటు దేశభక్తి, జాతీయ సమైక్యత ప్రాధాన్యాన్ని తెలియజేశారు. 600 మంది పేద విద్యార్థులకు చేయూత సాప్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో సంస్థను ఏర్పాటు...