వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు
పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి వేడుకలు యాదగిరిగుట్ట : (ప్రభంజనం) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయ అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, వేద పండితులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, కలశ స్థాపన తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ భవాని శంకర్ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా...