గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి
ప్రత్యేక అధికారి హనుమంతరావు నిజామాబాద్, (ప్రభంజనం): గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి కందకుర్తి పుష్కర ఘాట్‌ను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పార్కింగ్, రహదారులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మార్చి నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కందకుర్తిలో...