PRABANJANAM
Date of Publish : 23 October 2026, 8:53 am Posted by : Prabanjanam News

దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి..

  • కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్
  • జంపనను సన్మానించిన మండప నిర్వాహకులు

కంటోన్మెంట్,(ప్రభంజనం):

దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ ఒకటో వార్డు కంసారి బజార్ లో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం జంపన ను ను నిర్వాహకులు శాలువా తో సత్కరించి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు , కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయదశమి పర్వదినం కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కన్నా, బంటి,అర్జున్, ప్రసాద్ తో
పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.