PRABANJANAM
Date of Publish : 14 August 2026, 11:39 am Posted by : Prabanjanam News

భారత్‌లో మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!

హైదరాబాద్ ( ప్రభంజనం ):భారత్‌లో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి ధరలు దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.710 మేర తగ్గింది. గురువారం కూడా బంగారం ధర రూ.1,260 మేర తగ్గిన విషయం తెలిసిందే. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం (ఆగస్టు 14) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,890గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 మేర తగ్గి రూ.1,40,150కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,670 వద్ద కొనసాగుతోంది. వరుసగా బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ వంటి అంశాల ఆధారంగా పసిడి ధరల్లో మరోసారి హెచ్చుతగ్గులు చోటుచేసుకునే అవకాశం ఉంది.