PRABANJANAM
Date of Publish : 06 August 2026, 2:15 pm Posted by : Prabanjanam News

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా వీరికి హాలిడేస్

  • మూడు రోజులు సెలవులు.. హాలిడేస్ ప్లాన్..

తెలంగాణ :  హైదరాబాద్‌ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం, బోనాల సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. బోనాల సెలవుపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నప్పటికీ, లాంగ్ వీకెండ్ కోసం ఇప్పటికే పలువురు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు.  ఆగస్టు 8న రెండో శనివారం, ఆగస్టు 9న ఆదివారం కావడంతో సాధారణ సెలవులు ఉన్నాయి. ఆగస్టు 10న బోనాల పండుగ సందర్భంగా సెలవు ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ సెలవుల జాబితాలో బోనాలు ఉన్నప్పటికీ, విద్యాసంస్థలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఆగస్టు 10న హైదరాబాద్‌ లో బోనాల మహోత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే రంగం, పోతురాజుల విన్యాసాలు, ఘటం ఊరేగింపు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.

లాంగ్ వీకెండ్‌కు ప్రయాణాల ప్లాన్

వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో చాలామంది కుటుంబాలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు, మరికొందరు పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. దీంతో బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో తెలంగాణలోని పాఠశాలలు, విద్యాసంస్థలకు మొత్తం 11 రోజుల వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది. వీటిలో ఐదు ఆదివారాలు, మూడు ఆప్షనల్ సెలవులు, మూడు సాధారణ సెలవులు ఉన్నాయి.