నిరుద్యోగులకు శుభవార్త .. కానిస్టేబుల్ 34, ఎస్సై 37 ఏళ్లు ఏజ్ లిమిట్ పెంపు

యూనిఫాం ఉద్యోగాల వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు పోలీస్, ఫైర్, ఎక్సైజ్ ఉద్యోగాల అభ్యర్థులకు శుభవార్త తెలంగాణ బ్యూరో, ప్రభంజనం: తెలంగాణలో యూనిఫాం సర్వీసుల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. పోలీస్‌, ఫైర్‌, జైళ్లు, ఎస్పీఎఫ్‌, ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఫారెస్ట్‌ తదితర శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంలో ఇచ్చిన ఐదేళ్ల వయోసడలింపుతో కలిపి మొత్తం మినహాయింపు ఏడేళ్లకు చేరింది. ఇప్పటికే...