22-A భూములపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి:మారయ్య

సర్వే నంబర్లపై సమగ్ర విచారణ జరిపించాలి ప్రభుత్వం తీరును ఎండగట్టిన తెలంగాణ రక్షణ సేన  మేడ్చల్ (ప్రభంజనం) : కుత్బుల్లాపూర్ మండల పరిధిలో 22-A కింద నిషేధిత భూములుగా పేర్కొంటున్న సర్వే నంబర్లపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు ఎత్తరి మారయ్య డిమాండ్ చేశారు.ప్రభుత్వ రికార్డుల్లో నిషేధిత భూములుగా పేర్కొన్న ఆయా భూములకు ప్రస్తుత హక్కుదారులు ఎవరు, ఏ కారణాలతో వాటిని 22-A జాబితాలో చేర్చారు, సంబంధిత భూహక్కుదారులకు నోటీసులు ఇచ్చారా, భూ...