గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం…

హాజరైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కంటోన్మెంట్,(ప్రభంజనం): నాంపల్లిలోని రెడ్ రోజ్ గార్డెన్‌లో నిర్వహించిన హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్ హాజరయ్యారు. హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దీపక్ జాన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు, ఎన్నికల కార్యాచరణ, అర్హులైన...