- జాతీయ జెండాను ఆవిష్కరించిన పాఠశాల ప్రిన్సిపాల్ మధులత
ఆర్మూర్: ( ప్రభంజనం )
ఆర్మూర్‌లోని శ్రీ చైతన్య పాఠశాల శాఖలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మధులత జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మధులత మాట్లాడుతూ.. స్వేచ్ఛ అనేది మనకు లభించిన ఒక బహుమతి మాత్రమే కాదు, అది మనపై ఉన్న ఒక బాధ్యత అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
పాఠశాల డీన్ ప్రవీణ్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణ, దేశభక్తి, నైతిక విలువలను అలవర్చుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.