PRABANJANAM
Date of Publish : 21 September 2026, 8:42 am Posted by : Prabanjanam News

ఘనంగా ఏకదంతునికి పూజలు…

  • రూ.1లక్ష 62 వేలకు లడ్డు గెలుచుకున్న హరీష్ రెడ్డి
  • అభినందించిన ఎమ్మెల్యే శ్రీగణేష్, జంపన, పాండు యాదవ్..

కంటోన్మెంట్, (ప్రభంజనం)

గణేష్ నవరాత్రి మహోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే శ్రీగణేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఇతర నాయకులతో కలిసి మర్రి రాంరెడ్డి కాలనీ, నూతన్ కాలనీ, చిన్న తోకట్ట, ధనలక్ష్మీ కాలనీలలో నెలకొల్పిన మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా మండప నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీగణేష్, జంపన ప్రతాప్ లను శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇతర నాయకులతో కలిసి సౌజన్య కాలనీ కమ్యూనిటీ హాల్ లో గణనాథుడి మండపం వద్ద అన్నదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మర్రి రాంరెడ్డి కాలనీ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో జంపన ప్రతాప్, పాండు యాదవ్ లు పాల్గొని, కాలనీ మండపం వద్ద మర్రి హరీష్ రెడ్డి నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరాత్రులు పూజలందుకున్న లడ్డును హరీష్ రెడ్డి రూ.లక్ష 62 వేలకు వేలం పాటలో దక్కించుకోగా, జంపన ప్రతాప్, ఎమ్మెల్యే శ్రీగణేష్ హరీష్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు
సంపత్ కుమార్ రెడ్డి, అధ్యక్షులు
మధుసుధన్ రెడ్డి, కిషన్ రెడ్డి , మాలాద్రి, నర్సింహారావుతో పాటు కమిటీ సభ్యులు ఈశ్వర్ చరణ్, కృష్ణ యాదవ్, రమేష్, సాయి కుమార్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.