Harish Rao: సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే: హరీష్ రావు.

అకారణంగా నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలే ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు. కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 22-ఏ బాధితుల ప్రత్యేక సమావేశం. బాధితులకు అండగా నిలుస్తాం.. డిమాండ్లు నెరవేరకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిక. మేడ్చల్(ప్రభంజనం): కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో అర్హులైన రైతులు, భూ యజమానుల ఆస్తులను అకారణంగా 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం షాపూర్‌నగర్‌లోని ఎం.జే. గార్డెన్స్‌లో బీఆర్ఎస్ ఎల్పీ విప్, స్థానిక...